
హైదరాబాద్,క్రైమ్ మిర్రర్:- నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని, పెన్ కౌంటర్ దినపత్రిక సీఎండీ నాగుల ఆనంద్ కుమార్ నేత, శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్బంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ, డిజిపిగా శివధర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత, శాంతి భద్రతల సంరక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. 2026 సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణలో, తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, తగిన చర్యలు తీసుకున్న తెలంగాణ యావత్ పోలీస్ యంత్రాంగానికి, ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత అభినందనలను, శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also : క్రికెట్ అభిమానుల డిమాండ్ మేరకు ఆ ప్లేయర్ ను తొలగించాలి అని బీసీసీఐ ఆదేశాలు?
Read also : ఈరోజు బతికున్నాను అంటే దానికి కారణం అంజనేయస్వామీనే : పవన్ కళ్యాణ్





