
క్రైమ్ మిర్రర్,పెబ్బేరు :-ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు. మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం రెగ్యులర్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు (జనరల్ & ఒకేషనల్ విభాగాలు రెండూ), మార్చి 2026లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావడానికి పరీక్ష ఫీజు ను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా రేపటి నుండి నవంబర్ 14 తేదీ వరకు, 100 రూపాయల అపరాధ రుసుముతో 16 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో 26 వ తేదీ నుండి డిసెంబర్ 1 వ తేదీ వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 3 నుండి 8 వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 10 నుండి 15 వ తేదీ వరకు, చెల్లించవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. విద్యార్థులు చివరి తేదీ వరకు ఆగకుండా వీలైనంత త్వరలో ఫీజులు చెల్లించాలని డీఐఈఓ సూచించారు. కళాశాలల యాజమాన్యాలు బోర్డ్ నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు.
Read also : భర్త అన్నతోనూ కాపురం చేయమన్న అత్తమామలు!. చివరకి..?
Read also : యాదాద్రి ఇంచార్జి ఎస్ఈ రామారావు అవినీతి చిట్టా.!





