సినిమా

ఆఫర్ ఇస్తే రీ ఎంట్రీ కి రెడీ అంటున్న పవన్ హీరోయిన్..

కొంతమంది హీరోయిన్లకి కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాలు ప్లాప్ అవడంతో కెరీయర్ని పోగొట్టుకున్నవారు ఇండస్ట్రీలో కోకొల్లలని చెప్పవచ్చు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “పులి” సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నిఖీషా పటేల్ కూడా ఈ కోవకే చెందుతుంది. ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నికిషా పటేల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో నికిషా పటేల్ స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.

కానీ అందరి అంచనాలు తారమారవుతూ ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే అప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “ఓం 3డి” సినిమాని కూడా సైన్ చేయడంతో కనీసం ఈ సినిమా అయినా పెద్ద హిట్ అవుతుందని ఆశించినప్పటికీ అది కూడా జరగలేదు. దీంతో కెరీర్ స్టార్టింగ్ లోనే నికిషా పటేల్ కి రెండు సాలిడ్ ప్లాపులు పడేసరికి టాలీవుడ్ లో ఆఫర్లు కరువయ్యాయి. దీనికి తోడు సరైన ఫుడ్ డైట్ లేకపోవడంతో ఒక్కసారిగా బరువు పెరిగింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు ఇచ్చే విషయంలో దర్శకనిర్మాతలు వెనుకడుగు వేశారు.

కానీ నికిషా పటేల్ మాత్రం మళ్లీ ఫుడ్ డైట్ పాటించడం డైలీ వ్యాయామం చేయడం వంటివి చేస్తూ బరువు తగ్గింది. ప్రస్తుతం మంచి ఫిట్నెస్ తో ఫోటో షూట్లు చేస్తూ అందాల ఆరబోతతో సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఐదు పదుల వయసు దాటిన సీనియర్ హీరోలకి హీరోయిన్ల కొరత కొంతమేర ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీంతో ఈ అంశం నిఖీషా పటేల్ కి బాగానే కలిసి వచ్చేలా ఉంది. మన వైపు తన పాత్రకి ప్రాధాన్యత ఉండి, మంచి సాలిడ్ కంటెంట్ ఉండే స్టోరీలు దొరికితే గ్లామర్ పరంగా మరియు యాక్టింగ్ పరంగా ఇరగదీస్తానని నికిషా పటేల్ చెప్పకనే చెబుతోంది. అంతేకాదు అందాల ఆరబోతతో ఫోటోషూట్లు రీల్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రోజురోజుకీ ఫాలోయింగ్ కూడా బాగానే పెంచుకుంటోంది. మరి ఈ బ్యూటీ మొర ఆలకించి మన డైరెక్టర్లు, నిర్మాతలు ఆఫర్లు ఇస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button