
చిట్యాల, క్రైమ్ మిర్రర్:- చిట్యాల సుజన థియేటర్ వద్ద OG చిత్రాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా బాణా సంచార పేల్చి థియేటర్ వద్ద ఒక పండగ వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆర్గనైజర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆర్గనైజేషన్ ఫ్యాన్స్ మాట్లాడుతూ అభిమానులకు దసరా పండగ ముందుగానే ఓజీ రూపంలో వచ్చిందని అనడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ OG సినిమా ద్వారానే దసరాకు కూడా పండుగ వాతావరణం వచ్చిందని ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు వీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే, జనసేన అభిమానులు అందరూ కూడా థియేటర్లకు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. దసరా పండుగకు మరో వారం రోజులు ముందుగానే ఓజి సినిమా ద్వారా పండుగ వాతావరణం మొదలైందని.. ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒకవైపు ఓ జి మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ రోజు OG సినిమాకు వెళ్ళినట్లయితే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.
Read also : అద్భుతమైన VFX ను తలపించేలా ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు!
Read also : కిలో 2 రూపాయలు… ఇలా అయితే ఎలా బతకాలి?