ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్!.. ఏపీలో ఆసక్తికర పరిణామం?

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం గెలుపొందిన తరువాత ప్రతిరోజు కూడా సోషల్ మీడియా అలాగే డిజిటల్ మీడియా అన్నిట్లలో కూడా రాజకీయ విశ్లేషణలు గురించి నడుస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుండి చాలానే ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. అయితే కేవలం నాలుగే నాలుగు రోజులు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇన్చార్జి హోదాలో ముఖ్యమంత్రిగా ఉండనున్నారని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరగబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు సింగపూర్ వెళుతుండడంతో… ఆ నాలుగు రోజులపాటు అంటే చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి వచ్చేంతవరకు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఇంచార్జ్ హోదాలో… ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్నారని చెబుతున్నారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ను కొద్దిరోజులు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరారు. కానీ సీనియర్ చంద్రబాబు నాయుడు ఉండగా అది సాధ్యం కాలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసైనికులు కూడా ఇక చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎలాంటి అడ్డంకి పడలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఇక డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటుగా నారా లోకేష్ కొంతమంది మంత్రులు అలాగే అతని బృందం వెళ్లడంతో… ఇక రాష్ట్రంలో సీనియర్ నేతగా పవన్ కళ్యాణ్ కాబట్టి అతనికే ఇంచార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నాలుగు రోజులు పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కొనసాగితే మాత్రం.. అతని బలం అలాగే అతని తెలివి ఏంటి అనేది… అతను రాష్ట్రానికి ఏమేమి చేయగలరు అనేది కచ్చితంగా నిరూపించుకోవచ్చు. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలంటే… ఒకవేళ ఇంచార్జ్ హోదా ముఖ్యమంత్రి వస్తే మాత్రం ఇప్పుడే నిరూపించుకోవాల్సిన టైం ఏర్పడింది. దీంతో ఈ వార్తలు ఎంత నిజం ఉందో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు మాత్రం ఇది ఒక పండుగలా ఆనందాన్నిస్తుంది.

నిమిష ఉరిశిక్ష వాయిదా, యెమన్ సర్కారు సంచలన నిర్ణయం!

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి బాంబు బెదిరింపు… 4 ఆర్డీఎక్స్‌ బాంబులు పెట్టినట్లు మెయిల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button