
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- కర్ణాటకకు చెందిన రాజు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మహానంది క్షేత్రానికి బయలుదేరారు. ఆ ఈశ్వరుడి దర్శనం చేసుకోవడానికి ఆదివారం కారులో తన కుటుంబంతో కలిసి వచ్చారు. వాళ్ల వాహనాన్ని ఆలయ సమీపంలో పార్క్ చేసి అందరూ కారు దిగారు. అయితే ఇదే సమయంలో రాజు కూతురు కారులో నిద్రపోతుంది. ఇక దైవ దర్శనానికి వెళ్లడానికి అందరూ రెడీగా ఉండగా.. పాపను నా భార్య తీసుకొస్తుందిలే అని భర్త రాజు మూత్ర విసర్జనకు వెళ్లి అటు నుంచి అటు దైవ దర్శనానికి వెళ్ళాడు. ఇక మరోవైపు ఆ చిన్నారి తల్లి.. నా భర్త తీసుకొస్తాడు లే అని ఇద్దరూ కూడా వేరువేరుగా దైవదర్శనానికి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఆ చిన్నారి పాప కారులోనే నిద్రపోతూ గాలి ఆడక ఉక్కపోతతో లేచి కారులోనే ఏడుస్తూ ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆలయ అధికారులకు సమాచారాన్ని అందజేశారు.
Read also : ఈసీ పై మండిపడ్డ ప్రకాష్ రాజ్.. చెప్పేవన్నీ సాకులే?
వెంటనే హుటా హుటినా రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్, పొరుగు సేవల ఉద్యోగి నాగార్జున్ రెడ్డి ఇద్దరూ కలిసి అక్కడే ఉన్నటువంటి కానిస్టేబుల్ చంద్రశేఖరకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన వెంటనే కారు అద్దాలను పగలగొట్టి చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు. దీంతో అప్పటివరకు ఊపిరాడక ఇబ్బంది పడిన పాప.. ప్రాణాలతో బయటపడింది. ధైర్యం చేసి కానిస్టేబుల్ కారు అద్దాలను పగలగొట్టి ఆ చిన్నారిని బయటకు తీయకపోతే చిన్నారి ప్రాణానికే ప్రమాదం అయ్యుండేది అని.. స్థానికులు కానిస్టేబుల్ ను మెచ్చుకున్నారు. ఇక దేవస్థానంలోని మైకుల ద్వారా చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు ఎవరో త్వరగా రావాలి అని విజ్ఞప్తి చేయగా ఆ పాప తల్లిదండ్రులు వెంటనే ఆ కారు దగ్గరికి వచ్చి పాపను చూశారు. ఆ తల్లిదండ్రులు వెంటనే కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారిని ధైర్యసహసాలతో కాపాడిన కానిస్టేబుల్ ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు.
Read also : తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతాలు.. మునుపెన్నడూ లేని విధంగా?