
-ట్రాఫిక్ నిబంధనలు పాటించండి — ప్రాణాలను కాపాడుకోండి
-వేగంకన్న ప్రాణం మిన్న , మద్యం మత్తులో వాహనాలు నాడుపరాదు — సిఐ రవికుమార్ సూచన
-రావిర్యాలలో వాహనాలను తనిఖీ చేసిన ఆదిభట్ల పోలీసులు
-మైనర్లు వాహనం నడిపితే తల్లి దండ్రులే బాధ్యులు — సిఐ రవికుమార్
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్ :- మహేశ్వరం నియోజకవర్గం,తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల గాంధీ చౌరస్తా వద్ద ఆదిభట్ల పోలీసులు,సి ఐ రవికుమార్,ఎస్ ఐ సత్యనారాయణ,అధ్వర్యంలో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు వివిధ రకాల చాలాన్లు వేసారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ.. రోడ్డుపై వాహనం నడుపుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని సూచించారు.వాహనాదరులు హెల్మెట్,లైసెన్స్, వాహనం యొక్క ఆర్ సి.ఇన్సూరెన్స్ పోలిషన్ సర్టిఫికెట్,తప్పని సరిగా ఉండాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండని వారు (మైనర్లు) వాహనాలు నడిపితే వారి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని తెలిపారు. మైనర్లు వాహనం నడిపి ఏదైనా ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు శిక్ష అనుభవించవలసి వస్తుందని పేర్కొన్నారు. పిల్లలను మాదక ద్రవ్యాలు తీసుకోకుండా,చెడు వ్యసనాలకు బానిస కాకుండా వారిపై నిఘా పెట్టాలని తల్లిదండ్రులకు ఆదిభట్ల సిఐ రవికుమార్ తగిన సూచనలు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు.
Read also : అన్నా చెల్లెళ్ల అనుబంధమై.. అనురాగాల వెల్లువై.. మదిని మీటే సంబరం రాఖీ పౌర్ణమి!
Read also : నెరిసిన గడ్డంతో విరాట్ కోహ్లీ పిక్చర్!.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?