
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం గొట్టుముక్కుల గ్రామ పంచాయతీలో ఓ ఉద్యోగి అవినీతికి అడ్డుగా తలెత్తిన తాజా ఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగ మోహన్ రూ. 20,000 లంచం డిమాండ్ చేస్తూ, అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు అడ్డంగా పట్టుబడ్డాడు.
వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు తన ఇంటికి ఇంటి నంబరు కేటాయింపుతో పాటు బహిరంగ స్థలానికి అసెస్‌మెంట్ నంబర్ల మంజూరుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అప్లై చేసాడు. అయితే, ఈ ప్రక్రియలో అధికారిక అనుమతుల కోసం గంగ మోహన్ రూ. 20 వేల లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఫిర్యాదుదారి అంగీకరించడంతో, తుది చర్చల అనంతరం లంచం మొత్తాన్ని రూ. 18,000కు తగ్గించి తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అవినీతి పై మరోసారి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం గంగ మోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. అవసరమైన సాక్ష్యాధారాలతో పాటు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.