
క్రైమ్ మిర్రర్, వేములపల్లి:- వేములపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో ఏ ఒక్క గ్రామపంచాయతీ ఏకగ్రీవం కాలేదు. మొత్తం 42 మంది అభ్యర్థులు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. 291 వార్డు సభ్యులు బరిలో దిగారు. ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులను అధికారులు కేటాయించారు. ఈనెల 14న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు అన్ని పూర్తి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మండలంలో గ్రామపంచాయతీ బరిలో దిగిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మండలంలో ఆదివారం నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రచారం ఊపందుకొన్నాయి. బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమయ్యారు. వలస వెళ్లిన ఓటర్ల కోసం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు. వారి కోసం ప్రత్యేక తాయిలాలు కూడా ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. నేటి నుంచి గుర్తింపులతో ముద్రించిన పత్రాలతో జోరుగా ప్రచారం సాగనుంది. ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
Read also : అజ్జిలాపురం, శివన్నగూడెం గ్రామాలలో డబ్బు రాజకీయం..?
Read also : కోడాలి నానిని ఏం చేస్తారు సార్.. లోకేష్ స్పందన ఇదే?





