
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో హోరా హోరీగా, ఉత్కంఠంగా సాగినటువంటి పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. దాదాపు మూడు విడతల్లో భాగంగా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తానికి నిన్నటితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం కాస్త ప్రశాంతించింది. ఈనెల 11వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరూ టెన్షన్ తో జీవితాన్ని గడిపారు. ఎంతోమంది ఒక్క ఓటుతో గెలుపొందగా మరి కొంతమంది భారీ తేడాతో విజయాలను పొందారు. కొన్ని గ్రామాలలో ఈ పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు రాగా మిగతా అన్ని గ్రామాల్లో సజావుగా ఎన్నికలు ముగిశాయి. ఇక ఏమైనా కూడా తెలంగాణలో పంచాయతీ పోరైతే ముగిసింది.
Read also : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ AI వీడియో.. అభిమానుల రియాక్షన్ ఇదే?
ఇక మూడు విడతల్లో భాగంగా మొత్తంగా 12,702 గ్రామాల్లో ఎన్నికలు జరగగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 7500కు పైగా స్థానాల్లో ఘన విజయాలను సాధించారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 3500 కు పైగా సర్పంచ్ పదవులను గెలిచి రెండవ స్థానంలో నిలిచింది. ఇక్కడ మరో ఆశ్చర్యం ఏంటి అనగా బిజెపి కన్నా ఇతర ఇండిపెండెంట్ లు 1500 స్థానాలలో విజయాలు సాధించి మూడో ప్లేసులో నిలవగా బిజెపి పార్టీ 600 సర్పంచ్ పదవులు మాత్రమే గెలిచి 4 నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇండిపెండెంట్ లలో ఎక్కువమంది కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ రెబల్స్ కావడం విచిత్రం. ఏది ఏమైనా కూడా మొత్తానికి ఈసారి పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ విజయాలు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఇక పంచాయతీ పోరు ముగియడంతో ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలపై ప్రతి ఒక్కరు కసరత్తు చేస్తున్నారు.
Read also : రైళ్లలో వెళ్తున్న వారు అలర్ట్.. ఇకపై లగేజ్ కు అదనపు చార్జీలు?





