
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య రెండు రోజులు తీవ్రతరంగా యుద్ధం జరిగిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్స్ సింధూర్ పేరిట పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల స్థావరాలను అలాగే ఎయిర్ బేస్ల పై దాడి చేసి భారత్ రేంజ్ ఏంటో పాకిస్తాన్ కు చూయించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడిలో మాకు ఎలాంటి నష్టం జరగలేదంటూ ఫేక్ న్యూస్ అడ్డగోలుగా ప్రచారం చేసిన పాకిస్తాన్… నేడు అసలు నిజం ఏంటో ఒప్పుకుంది. భారతదేశము చేసిన దాడులు ఏ రేంజ్ లో ఉన్నాయనేది స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి శాభాజ్ షరీఫ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తీవ్రత పాకిస్తాన్ దేశంపై చాలానే పడిందని పాక్ ప్రధానమంత్రి మాట్లాడడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడులను తొలిసారిగా పాకిస్తాన్ ప్రధానమంత్రి శాభాజ్ అంగీకరించారు.
పాకిస్తాన్ ఎన్నో రకాలుగా భారత్ పై డ్రోన్లు మరియు క్షపనులతో దాడికి దిగగా వాటన్నిటిని భారత సైన్యం తిప్పి కొట్టిందని పాకిస్తాన్ ప్రధాని తెలియజేశారు. అర్ధరాత్రి రెండున్నర గంటలకు నూర్ఖాన్ ఎయిర్ బేస్ అలాగే ఇతర స్థావురాలపై భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడుల గురించి ఆసిమ్ మునీర్ తెలిపారని పాక్ ప్రధాని అన్నారు. భారతదేశం కాల్పుల విరమణను ప్రతిపాదించిందని కూడా అతనే చెప్పారని పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకు భారత్పై పాకిస్తాన్ గెలిచిందని ఫేక్ న్యూస్లతో ప్రచారం చేసిన పాకిస్తాన్ నేడు అసలు నిజం ఏంటో బయట పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. మాట మార్చడంలో పాకిస్తాన్ ఏ ముందుంటుందని మరోసారి రుజువయింది.
కేసీఆర్, హరీష్, ఈటలకు రిలీఫ్.. కాళేశ్వరం కమిషన్ సంచలన రిపోర్ట్