
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్:-నిన్న మొన్నటి వరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నారు. మంగళవారం రాత్రి భారత ఆర్మీ పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అవి ధ్వసం అవ్వడంతో పాటూ దాదాపు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. భారత్ మెరుపు దాడులతో ఖవాజా దిగివచ్చారు.
ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్థాన్ కాల్పులు విరమించుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్ తన చర్యలను నిలిపివేస్తే పాకిస్థాన్ సైన్యం కూడా కాల్పులను విరమిస్తుందని స్పష్టం చేశారు. లేదంటే మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా అని అన్నారు. అయితే పాకిస్థాన్‌ను కేంద్రం నమ్మే ప్రసక్తి లేనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పాక్ తాము భారత్‌లో ఎక్కడైనా ఎప్పుడైనా దాడి చేయవచ్చని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పాక్ ఇండియన్ ఆర్మీతో పోరాడకుండా జమ్మూకశ్మీర్ బార్డర్ వద్ద సామాన్యులపై దాడులకు పాల్పడుతోంది. భారత ఆర్మీ పాక్ పిరికి చర్యలను తిప్పికొడుతోంది.