అంతర్జాతీయంక్రీడలు
Trending

భారత్ వల్ల భారీగా నష్టపోయిన పాకిస్తాన్!… ఎందుకో తెలుసా?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ ఘనవిజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ముచ్చటగా మూడవసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఫైనల్ లో న్యూజిలాండ్ పై ఆఖరి ఓవర్ దాక పోరాటం చేసి టీమిండియా నెగ్గింది. ఇక ఈ సంవత్సరం చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరిగిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ కేవలం ఇండియా పాకిస్తాన్ వెళ్ళకపోవడం వలన పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. ప్రపంచంలో క్రికెట్ ఆడి అన్ని దేశాలు పాకిస్తాన్ వెళ్లిన ఒక భారత్ వెళ్లకపోవడం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ 20 25 నిర్వహించిన పాకిస్తాన్ కు భారీ నష్టాన్ని మిగిల్చింది. మొదటగా ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో నిర్వహిస్తే పాకిస్తాన్ కు భారీగా ఆదాయం రావడంతో పాటుగా పాకిస్తాన్ దేశం తిరిగి మళ్లీ హైపును పెంచుకుంటుందని పాకిస్తాన్ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: రాజ్ కుమార్ రెడ్డి

ఇక మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ టీం లీగ్ దశలోనే నిష్క్రమించడంతో పరువు మొత్తం పోయింది. ఎవరి చేతిలో అయితే ఓడిపోకూడదని అనుకున్నారో అదే భారత్ టీం చేతిలో ఓడిపోయింది. చెత్త ప్రదర్శన చేయడంతో పాటుగా లీగ్ దశలోనే ఆ టీం నిష్క్రమించడంతో సొంత ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్లు కూడా పాకిస్తాన్లో జరగకపోవడంతో భారీగా ఆర్థికంగా నష్టపోయింది. నిజానికి చెప్పాలంటే 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్కు ఒక ఐసీసీ టోర్నమెంట్కు ఆదిత్యము ఇచ్చే అవకాశం దక్కింది. అంతేకాకుండా పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేకపోవడంతో క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో పాకిస్తాన్లో పర్యటించేందుకు టీమిండియా జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో టీమిండియాతో జరగాల్సిన అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్ లోనే జరిగాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టీమిండి ఆడిన మరియు సెమీఫైనల్ అలాగే ఫైనల్ మ్యాచ్ లు అన్నీ కూడా దుబాయ్ లోనే జరిగాయి. దీనివల్ల పాకిస్తాన్ కు భారీ నష్టం వాటిల్లింది.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి – కాంగ్రెస్‌లో అంతే..!

పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదం కారణంగా 1996 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ అసలు జరగలేదు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం రావడంతో మంచి ఆదాయం వస్తుందని అందరూ భావించారు. దీనికోసం కరాచీ, లాహోర్, రావలపిండి క్రికెట్ స్టేడియాలను రూపుదిద్దించారు. కొన్ని పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రకారం ఈ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ ఏకంగా 64 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా 558 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. దీనితోపాటుగా ఆతిథ్యం మరియు రవాణా కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. కానీ ఈ ఐసీసీ టోర్నమెంట్ వల్ల పాకిస్తాన్కు కొంచెం కూడా లాభం లేదు. లాభం మాట పక్కన పెడితే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button