
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిది : అపరేషన్ సిందూర్.. విజయవంతమైంది. ఉగ్రవాదుల అండతో పేట్రేగిపోతున్న పాకిస్థాన్‌ను చావు దెబ్బ కొట్టింది భారత్. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకలను టార్గెట్ చేసి.. వందలాది టెర్రిరిస్టులను అంతం చేసింది. అందులో ఉగ్రసంస్థల్లో కీలకంగా ఉన్నవారు.. మోస్ట్ వాంటెడ్లు కూడా ఉన్నారు. ఐదుగురు కీలక ఉగ్రవాదుల జాబితాను కూడా విడుదల చేసింది. ఐదుగురిలో జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఐదుగురు ఉగ్రవాదుల్లో… ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ ఒకడు. ఇతను…ఆపరేషన్ సిందూర్‌లో హతమైన లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ చీఫ్, పాకిస్తానలోని పంజాబ్ పోలీసు సీఎం, ఐజీ పాల్గొన్నారు. రెండో ఉగ్రవాది.. హఫీజ్ మహమ్మద్ జమీల్.. ఇతను జైషే మహమ్మద్ ఉగ్రముఠాలో కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. మూడో ఉగ్రవాది.. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్‌జీ. ఇతను కూడా జైషే ముఠాకు చెందిన కీలక ఉగ్రవాదే. మసూద్ అజార్ మరో బావమరిది. ఐసీ-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు. నాలుగో వాడు.. ఖలీద్ అలియాస్ అబు అకాస.. లష్కరే తోయిబాలో టాప్ ఉగ్రవాది. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. ఆఫ్గనిస్థాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు. ఫైసలాబాద్‌లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు కూడా.. పాక్‌లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం. ఐదో ఉగ్రవాది.. మహమ్మద్ హసన్ ఖాన్.. జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో హసన్ ఖాస్… కీలక పాత్ర పోషించాడు.
దష్టులకు ఆశ్రయిమిస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్.. కీలక ఉగ్రవాదులను భారత్ అంతం చేయడంతో ఉక్రోశంతో రగిలిపోయింది. భారత్‌పై 500 డ్రోన్లు వదిలింది. వందల సంఖ్యలో క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. అన్నింటినీ.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ దెబ్బ… విలవిల్లాడిని పాకిస్థాన్… దిగివచ్చింది. కాల్పుల విరమణే మేలు అనుకుని… కాళ్ల బేరానికి వచ్చింది. ఫలితంగా… భారత్-పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది.