
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- నేడు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ లో భాగంగా టి20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు భారత్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఇరుదేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అని తెలిస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా స్టేడియాలకు క్యూ కట్టడం చేస్తుంటారు. స్టేడియాలకు వెళ్లడం కుదరకపోతే టీవీలకు అతుక్కుని మరి.. మ్యాచ్ ముగిసే వరకు పక్కకి కదలరు. కానీ నేడు ఆసియా కప్ లో భాగంగా జరగబోయే దాయాదుల పోరుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. యూఏఈ లో జరిగే ఈ మ్యాచ్ కు టికెట్లు సగం వరకు అమ్ముడుపోలేదు. అభిమానులు స్టేడియానికి ఇక రారు అనుకొని.. సగం ధరకే టికెట్లు అమ్మదలుచుకున్న కూడా అభిమానులు టికెట్లు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
Read also : అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 3వ మహాసభలు
సాధారణంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అని తెలిస్తేనే క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా అలర్ట్ అవుతుంది. టోర్నీ ఎప్పుడు జరుగుతుంది, వెన్యూ ఏంటి, ఏ ఫార్మేట్ అనే దాంతో సంబంధం లేకుండా మ్యాచ్ కోసం కల్లు కాయలు కాచేలా చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి శత్రుదేశంతో ఇవాళ మ్యాచ్ జరుగుతున్న కూడా ఎటువంటి ఉత్కంఠత అనేది కనిపించడం లేదు. దీనంతటికి కారణం పహల్గాం ఉగ్రదాడి. ఈ పహల్గాం లో మన భారత ప్రజలపై జరిగిన ఉగ్రదాడి తరువాత సిట్యుయేషన్ అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. దాయాది దేశంతో క్రికెట్ వద్దని దేశంలోని ప్రతి ఒక్కరు కూడా వారిస్తూ ఉన్నారు. ఇవాళ జరగబోయే మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని చెప్పి చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీంతో ఇవాళ జరగబోయే మ్యాచ్ మీద ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి లేదు అని అర్థం అయిపోయింది. మరి ఈ సాయంత్రం మ్యాచ్ జరిగేంతవరకు కూడా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియట్లేదు. మరి మీరు కూడా ఇవాళ మ్యాచ్ చూస్తున్నారా?.. చూస్తే ఒకవేళ ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి.
Read also : సీఎం సహాయ నిధి పేదలకు వరం : శ్రీనివాస సేవా సమితి చైర్మన్