
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బండ్ల గణేష్ అంటే ఒక నిర్మాత గానే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా ఎన్నో సందర్భాల్లో ఉండడం చూస్తున్నాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా రెండోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్న బండ్ల గణేష్ కు చాలా అభిమానం. ఇదే అభిమానంతో బండ్ల గణేష్ కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు ను ఎలాంటి మచ్చ లేకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అని.. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన రోజుల్లో నేను ఎటువంటి మచ్చ లేకుండా చంద్రబాబు నాయుడు బయటకు వస్తే తిరుమల కు కాలినడకన వస్తానని మొక్కుకున్నారట. చంద్రబాబు ఎటువంటి మచ్చలేకుండా జైలు నుంచి బయటకు రావడం పై స్పందిస్తూనే అనుకున్నట్టుగానే ఆ తిరుమల తిరుపతి క్షేత్రానికి పాదయాత్ర చేస్తానని తెలిపారు. జనవరి 19వ తేదీన హైదరాబాదులోని తను నివాసం ఉంటున్నటువంటి షాద్నగర్ నుంచి నేరుగా తిరుపతి వరకు పాదయాత్ర ప్రారంభిస్తాను అని తెలిపారు. ఇక ఈ యాత్ర సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో ముగుస్తుంది అని వెల్లడించారు. దీంతో బండ్ల గణేష్ ఒక్కసారి ఒకరిపై అభిమానాన్ని చాటుకుంటే వారి కోసం ఎంతకైనా వెనుకాడ బోరు అని మరోసారి నిరూపించారు.
Read also : రిలీజ్ అవ్వకముందే అంత సిద్ధం చేసుకోవాలి కదా.. మూవీ మేకర్స్ పై ఫ్యాన్స్ ఫైర్?
Read also : వ్యక్తిగతంగా పరువు తీసే బదులు కాస్త విషం ఇచ్చి చంపండి : కోమటిరెడ్డి





