వరల్డ్ కప్ లో పసి కూనల పోరాటం అద్భుతం

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఈనెల 7వ తేదీన టి20 ప్రపంచ కప్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ వరల్డ్ కప్ లో భాగంగా పసి కూనలు అనుకున్న దేశాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. విజయాలు సాధించలేకపోయినా కూడా ప్రేక్షకుల మనసులను మాత్రం సులభంగా గెలిచేస్తున్నారు. గెలుపు ఖాయం అనుకున్న జట్లకు చివరిలో చెమటలు పట్టిస్తున్నారు. ఇండియా,పాకిస్తాన్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మరియు శ్రీలంక వంటి జట్లను ఈరోజు నేపాల్, స్కాట్లాండ్, యూఏఈ, ఐర్లాండ్, యూఎస్ఏ, ఆఫ్ఘనిస్తాన్ వంటి పసికూన జట్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ప్రపంచ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్లో నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ 3 వికెట్లు తేడాతో గెలిచిన కూడా నెదర్లాండ్స్ చేసిన పోరాటంపై ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరిగిన మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగి చివరకు ఇండియా గెలిచింది. ఇక తాజాగా ఇంగ్లాండ్ ను నేపాల్ జట్టు ఒక విధంగా ఓడించినంత పని చేసింది. కేవలం 4 పరుగులు తేడాతోనే ఇంగ్లాండ్ పై నేపాల్ ఓడిపోవడం జరిగింది. ఇక నిన్న సాయంత్రం ఐర్లాండ్ పై శ్రీలంక సైతం ఇదేవిధంగా తక్కువ పరుగులతో విజయాన్ని సాధించింది. దీంతో గెలవాలన్న కసి ఈ పసికూన దేశాలలోని ప్లేయర్స్ లలో స్పష్టంగా కనిపిస్తుంది. కచ్చితంగా ఈ ఇటువంటి వరల్డ్ కప్ అనేది అంత ఈజీగా అయితే ఏ జట్టుకు ఉండదు. దానికి కారణాలు తాజాగా ఈ రెండు రోజులు జరిగిన సన్నివేశాలను చూస్తుంటేనే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది.
Read also :
కె కె స్వర ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్
అభివృద్ధి చేసే బాధ్యత నాది.. ఆశీర్వదించే బాధ్యత మీది : ఎమ్మెల్యే వేముల వీరేశం









