Homeఅంతర్జాతీయంమా వేళ్లు ట్రిగ్గ‌ర్‌పైనే ఉన్నాయి...అప్ర‌మ‌త్తంగా ఉండాలి...! మొజ్తాబా ఖ‌మేనీ....

మా వేళ్లు ట్రిగ్గ‌ర్‌పైనే ఉన్నాయి…అప్ర‌మ‌త్తంగా ఉండాలి…! మొజ్తాబా ఖ‌మేనీ….

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ప‌శ్చిమాసియాలో యుద్దంగా పూర్తిగా ముగియ‌లేద‌ని మా వేళ్లు ట్రిగ్గ‌ర్‌పైనే ఉన్నాయ‌ని ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ముజ్తాబా ఖ‌మేనీ పేర్కొన్నారు. కాగా ఉద్రిక్త‌లు తాత్కాలికంగా తెర‌ప‌డింది. అమెరికా- ఇరాన్ మ‌ధ్య రెండు వారాలపాటు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదిరింది. ఈ సంద‌ర్భంగా ఖ‌మేనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దాడులు ఆపాలని తమ సైనిక దళాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే యుద్ధం పూర్తిగా ముగియలేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్’ టెలివిజన్ ఖమేనీ ప్రకటనను చదివి వినిపించింది. ‘అన్ని సైనిక విభాగాలు సర్వోన్నత నాయకుడి ఆదేశాన్ని పాటించి కాల్పులు ఆపాయి. కాల్పుల విరమణ అంటే యుద్ధం ముగిసినట్లు కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రు దేశాలు మళ్లీ దురాక్రమణకు పాల్పడితే పూర్తి బలంతో దీటుగా స్పందిస్తాం’ అని పేర్కొంది. ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని, ఇరుపక్షాల మధ్య రెండు వారాల పాటు కొనసాగుతాయని టెహ్రాన్ ధ్రువీకరించింది.

హ‌ర్మూజ్ తెరిచేందుకు అంగీకారం…

హ‌ర్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని, దీంతో రెండు వారాల పాటు ఇరాన్‌పై ఎలాంటి దాడులూ చేయబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌తో శాశ్వత ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ గడువు ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ పంపించిన పది పాయింట్ల ప్రతిపాదనలు కూడా సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments