Tuesday, March 17, 2026
Homeతెలంగాణపథకం ప్రకారమే మా కార్యాకర్తలపై దాడి చేశారు : బీజేపీ

పథకం ప్రకారమే మా కార్యాకర్తలపై దాడి చేశారు : బీజేపీ

చండూరు, క్రైమ్ మిర్రర్ :-చండూర్ మున్సిపాలిటీలో ఆదివారం బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా చండూరు పట్టణంలో వ్యాపార సంస్థలు బంద్ చేయించిన బిజెపి నాయకులు. బంద్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రధానకార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్,బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహార్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పథకం ప్రకారం గతంలో హెచ్చరించిన మాదిరిగానే నిన్న దాడి చేశారు,ఈ దాడిని ప్రజాస్వామ్యం నమ్మే యావత్ ప్రజాస్వామ్యాన్ని నమ్మేట్టు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరిగి ఉండవు. ఇది పథకం ప్రకారము బిజెపి కార్యకర్తలను హత్య చేయడానికి ప్లాన్, మున్సిపల్ ఎలక్షన్లు జరిగి నెల రోజులు కాకముందుకే చండూరులో గుండా రాజకీయాలు మొదలయ్యాయి, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలని నిన్న బిజెపి బంధు ప్రకటించింది దానికి అనుగుణంగా చండూరు మున్సిపాలిటీ ప్రజలు స్వచ్ఛందంగా బందు పాటించారు దానికి భారతీయ జనతా పార్టీ తరఫున చండూరు మున్సిపాలిటీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

* పథకం ప్రకారమే బిజెపి కార్యకర్తల పై దాడి.
* గతంలోనే భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్ నాయకులు.
* ఈ దాడిని ప్రజలందరు ఖండించాలి.
* పథకం ప్రకారమే బిజెపి కార్యకర్తలను హత్య చేయడానికి యత్నించారు.
* దాడికి దాడికి పాల్పడిన వారిని ఇప్పటివరకు అరెస్టు.
* తూతు మంత్రం గా అరెస్టు, చేసి రాత్రికి రాత్రే వదిలిపెట్టారు.
* మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారు.
* దాడికి సంబందించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం.
* నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యమయ్యాయి.
* ఫిర్యాదుల పేర్కొన్న 16 మందిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
* కేసులు నీరు కార్చే పనిలో పోలీసులు ఉన్నారు.
* కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి పాలనను గాలికి వదిలేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ,బొమ్మరబోయిన రాజు,అన్నెపర్తి యాదగిరి ,ముదిగొండ ఆంజనేయులు,పిన్నింటి నరేందర్ రెడ్డి ,వంగూరి రాఖీ ,బూతరాజు శ్రీహరి,సోమ నర్సింహా ,రంగా రెడ్డి ,మురళి మనోహర్ రెడ్డి,కోమటి వీరేశం ,బూతరాజు స్వామి ,సోమ శంకర్ ,నకిరేకంటి లింగస్వామి,పడసనబోయిన శ్రీను ,ఆవుల అశోక్ ,పాశం శ్రీనివాస్ రెడ్డి ,మిర్యాల వెంకటేశం మరియు తదితరులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments