
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి RRR సినిమాలో నాటు నాటు సాంగుకు ఆస్కార్ అవార్డు పొందినటువంటి రాహుల్ సిప్లిగంజ్ తాజాగా నేడు పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో కలిసి రాహుల్ సిప్లిగంజ్ ఏడడుగులు నడిచారు. స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ సిప్లిగంజ్ ఇన్నాళ్లకు ఓ ఇంటి వాడయ్యాడు. చాలా రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ నేడు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఇవాళ జరిగిన రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకకు ప్రముఖ సెలబ్రిటీలు అలాగే ఇరు కుటుంబాల బంధువులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే ఈ హరిణ్య రెడ్డి. ఒకవైపు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడినటువంటి రాహుల్ సిప్లిగంజ్ కు RRR సినిమాలోనీ “నాటు నాటు” సాంగు తో ఆస్కార్ స్థాయికి ఎదిగి ప్రతి ఒకరి నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక పెళ్లికి హాజరు ఖాళీ అయినటువంటి పలువురు ప్రముఖులు అలాగే అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read also : Butantan-DV: ప్రపంచంలోనే తొలిసారి.. సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్
Read also : Life happiness study: ఆ విషయంలో డబ్బు ఖర్చు చేసేవారు మస్త్ సంతోషంగా ఉంటారట!





