అంతర్జాతీయం

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఈ దేశాలకు భారీగా తగ్గిన పర్యాటకుల సంఖ్య!

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరిట పాకిస్తాన్ స్థావరాలను నేలమట్టం చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కొన్ని దేశాలు పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచాయి. పహల్గాంలో ఉగ్రవాదులు మన హిందువులను భార్య పిల్లల ఎదుటనే భర్తలను చంపేశారు. ఇది కొద్ది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా అన్ని సోషల్ మీడియాలలో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఉగ్రవాదులు ఎవరు అనేది… అలాగే వాళ్లందర్నీ కూడా అంతం చేయాలని చెప్పి కేంద్రం ఆపరేషన్ సింధూర్అనే పేరిట యుద్ధాన్ని ప్రారంభించింది. పహల్గామ్ దాడిలోని ఉగ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ కి చెందిన వారిని భారత్ కనిపెట్టింది. అలాగే ఆపరేషన్ సింధూర్ పేరిట కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ ఉగ్రస్తావురాలను నేలమట్టం చేసి భారత్ పవర్ ఏంటో చూపించింది.

Read also : కోహ్లీ, రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్!…

అయితే ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో పాకిస్తాన్ దేశానికి తుర్కియే, అజర్ బైజాన్ వంటి దేశాలు అండగా నిలిచాయి. గతంలో భారత్ ఈ రెండు దేశాలకు ఎంతో సహాయం చేసింది. ఇండియా నుంచి ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఈ రెండు దేశాలకు పర్యాటకంగా వెళుతూ ఉంటారు. అయితే సాయం చేసిన దేశాన్ని ఈ రెండు దేశాలు మర్చిపోవడంతో.. భారతీయులలో ఈ రెండు దేశాలపై ఆగ్రహం పెరిగిపోయింది. గత మూడు నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య ఆ రెండు దేశాల్లో దాదాపు 50% పైగా తగ్గింది. ఈ ఏడాది మే వరకు 31,700 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా.. ఆ సంఖ్య జూలైలో ఏకంగా 15 వేలకు తగ్గిపోయింది. దీంతో ఇలానైనా సరే సాయాన్ని మరిచిన దేశాల పై భారత్ ఇలా ఏదో ఒక రంగంలో ప్రతీకారం తీర్చుకుంటుంది.. భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తుంటుంది అని.. షాకిస్తున్నారు. తుర్కీయే దేశానికి భారత్ నుంచి పర్యాటకులు వెళ్లడం పెద్ద మొత్తంలో తగ్గిపోయింది. దీంతో తుర్కీయే మరియు అజర్ బైజాన్ దేశాల పర్యాటక రంగంపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ బాగానే పడింది.

Read also : మా ఉత్పత్తులను కొనకండి, ట్రంప్ పై జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button