
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- భారత జనతా పార్టీ ఆత్మకూరు(ఎం)మండల శాఖ అధ్యక్షులు గజరాజు కాశీనాథ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమనాథ స్వామి ఆలయంపైన దాడి జరిగి 1000 సంవత్సరాలైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ విచ్చేసి మాట్లాడుతూ 1026 జనవరిలో గజిని మహమ్మద్ అమర్నాథ్ ఆలయంపై దాడి చేసి మందిరాన్ని కూల్చివేశాడు. విశ్వసం నాగరికతకు సంబంధించిన ఈ గొప్ప చిహ్నంపై అనాగరిక దండయాత్ర జరిగి 2026 నేటికి 1000 సంవత్సరాలు పూర్తవుతుంది.సోమనాథ్ మందిరం ఈ 1000 సంవత్సరాల సహనాన్ని పునర్జీవనాన్ని నిరంతరం నిలబడ్డానికి గుర్తుగా ఈ సంవత్సరానికి సోమనాథ్ స్వాభిమాన పర్వంగా జరుపుకుంటాం.ఈ 1000 సంవత్సరాల ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ ఆలయం ఇప్పటికే సగర్వంగా వైభవపేతముగా నిలబడింది. ఈ మందిరం నిర్మాణం 75 వ వార్షికోత్సవం కూడా 2026 లోనే జరుగుతుంది.
Read also : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య క్యాలెండర్ ఆవిష్కరణ
1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో సోమనాథ్ ఆలయాన్ని భక్తుల కోసం తెర్చారు,1026 దండయాత్ర మూడు రోజులు పాటు జనవరి 8 9 10 కొనసాగింది.ఈ హృదయ విధారక గాయాన్ని స్మరించుకుంటూ సోమనాథ్ సమగ్రతకు నీరాజనం అర్పిస్తూ ఈరోజు శివాలయంలో ఓంకార మంత్రాన్ని జపిస్తూ అభిషేకాలు అర్చనలు పూజలు హారతులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బొట్టు అబ్బయ్య, జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి,జిల్లా నాయకులు బొబ్బల ఇంద్రారెడ్డి,పాండు రంగారెడ్డి,బండారు సత్యనారాయణ,మండల ప్రధాన కార్యదర్శి రాగటి మచ్చగిరి, పుల్లాయిగూడెం సర్పంచ్ నర్రాముల రామలింగం యాదవ్, ఆత్మకూరు(ఎం)గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్,బిజెపి నాయకులు లోడి వెంకటయ్య,యాస వెంకట్ రెడ్డి, పరకాల రాంబాబు,యాస శ్రీనివాస్ రెడ్డి,మజ్జిగ లక్ష్మణ్, బబ్బూరి శివలింగం,ఎండి అబ్బాస్,ఉప్పలయ్య,ఉదయ్, బండారు సాయి,తదితరులు పాల్గొన్నారు.
Read also : సన్నిధానం బయలుదేరిన అయ్యప్ప స్వామి





