
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుత కాలంలో టెక్నాలజీని ఉపయోగించి చాలామంది కూడా సినిమాలను పైరసీ చేస్తూ ఎంతో డబ్బును దోచుకుంటున్నారు. తాజాగా ఐ బొమ్మ మరియు బప్పం వంటి వెబ్సైట్లు కూడా ఇలానే సినిమాలను ఓటీటిలో విడుదలైన మరుక్షణమే హెచ్డీ క్వాలిటీతో వారి వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుని ప్రేక్షకులకు రూపాయి ఖర్చు లేకుండా చూపిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సందర్భంలోనే తాజాగా పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే భయం మాత్రమే పైరసీని ఆపగలదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. పైరసీ భవిష్యత్తులో కూడా ఆగదు అని.. దానికి కారణం టెక్నాలజీ కాదని.. పైరసీ చూడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రేక్షకులే దీనికి కారణమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో సినిమా టికెట్ ధరలు చాలా ఎక్కువ అలాగే థియేటర్లోని తినుబండారాల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టే ప్రజలు పైరసీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా చూడాలని అనుకుంటున్నారు. నగలు ఖరీదుగా ఉన్నంత మాత్రాన దుకాణాన్ని దోచుకుంటామా?.. ఇది కూడా అలాంటిదే అని అన్నాడు. పైరసీని నిర్మొహమాటంగా ఆపివేయాలంటే అక్రమ లింకులు ఇచ్చే వారితో పాటు వాటిని చూస్తున్నా జనాన్ని కూడా శిక్షించాలి. అప్పుడే ఇటువంటి పైరసీలు జరగకుండా ఉంటాయి అని ఆర్జీవి తన సలహాను సోషల్ మీడియా వేదికగా బయటకు తెలిపారు.
Read also : బంగ్లాదేశ్ లో భారీ భూకంపం.. 10మంది మృతి, 100 మందికి పైగా గాయాలు?
Read also : కోర్టు ఆదేశాల ధిక్కరణ… కంటెంప్ట్ కేసు వేస్తా : యుగంధర్ రెడ్డి





