
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-విజయ్ హజారే ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేయగా రెండో మ్యాచ్ లో మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. మొదటి మ్యాచ్ లో 150 పైగా పరుగులు చేయగా రెండో మ్యాచ్ లో మాత్రం డక్ ఔట్ అయ్యారు రోహిత్ శర్మ. దీంతో రోహిత్ శర్మ ఆటను చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం విజృంభించి ఆడుతున్నారు. 61 బంతుల్లో 77 పరుగులు చేసి కోహ్లీ సైతం అవుట్ అయ్యారు. అయితే మొదటి మ్యాచ్ లో వీరిద్దరూ సెంచరీలు చేసి వారి హవా కొనసాగించుగా రెండవ మ్యాచ్ లో మాత్రం కోహ్లీ అదే కంటిన్యూ చేయగా రోహిత్ శర్మ మాత్రం డక్ ఔట్ అయ్యి పూర్తిగా నిరాశపరిచారు. ఈరోజు ఉత్తరాఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ బోరా బౌలింగ్ లో నాగర్ కోటికి క్యాష్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఇక వీరిద్దరినీ ఫీల్డింగ్ లో మాత్రమే చూడగలము అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. కాగా ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్పులో వీరిద్దరికి చోటు దక్కాలి అని ఫ్యాన్స్ ఇప్పటినుంచి కోరుకుంటున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్పులో కచ్చితంగా వీరిద్దరూ ఆడాలి అని ఇప్పటి నుంచే ఎంతో మంది ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ వీరిద్దరూ సెలెక్ట్ అయి వన్డే వరల్డ్ కప్ లో ఆడితే మాత్రం ఇక అదే వారికి చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వన్డే ఫార్మేట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
Read also : ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు : కాకాణి గోవర్ధన్
Read also : పెన్సిల్ ఛాతిలో గుచ్చుకొని UKG బాలుడు మృతి!





