
క్రైమ్ మిర్రర్ కల్వకుర్తి:- విద్యార్థులు చదువుతోపాటు విద్యార్థి దశ నుంచే క్రీడల పై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కల్వకుర్తి సీఐ నాగార్జున సూచించారు. ఆగస్టు 03 & 04 తేదీల్లో
హనుమకొండ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోయే సౌత్ జోన్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కోసం శనివారం కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన అండర్ 14, 16, 18, 20 బాల బాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్సై మాధవరెడ్డి తో కలిసి సీఐ హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారుల ఎంపిక కోసం జిల్లా నలుమూలల నుంచి దాదాపు 350 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ నాగార్జున మాట్లాడుతూ..విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకొని క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతో పాటు దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునే శక్తి సామర్థ్యాలు సిద్ధిస్తాయని అన్నారు.విద్యార్థులు పాఠశాల దశ నుంచే క్రీడల్లో పాల్గొంటూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగి విశ్వ విజేతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలతో స్నేహ సంబంధాలు అలవరుతాయి అలాగే శారీరక మానసిక ఉల్లాసం కలిగి క్రీడాకారులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని వారు సాధించే ప్రశంసా పత్రాలు మెడల్స్ భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
రాష్ట్ర , జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా ఉంటుందని గుర్తు చేశారు. ఓడిపోయిన క్రీడాకారులు ఏమాత్రం నిరాశ చెందకుండా మరింత సాధన చేస్తే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించి సమాజంలో మంచి గుర్తింపు పొందుతారని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి, సంయుక్త కార్యదర్శులు పరశురామ్, అంజయ్య లతో పాటు సీనియర్ క్రీడాకారుడు స్కైలాబ్, ప్రకాష్, రాజేంద్రప్రసాద్, అంజి, జగన్, పీడీ లు ఎస్.ప్రసాద్ , ప్రకాష్ , మైబమ్మ , శారద , జగన్ , బాల శ్రీ, సుభాషిని, బాలయ్య . పీఈటీ లు రాజేందర్, మల్లేష్ రాధిక, విజయలక్ష్మి, గోమతి, అనిత, వెన్నెల, పద్మ, మల్లేష్, మాజీ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కంటతడి పెట్టిస్తున్న కస్తూరిబా కష్టాలు.. బిల్డింగ్ సదుపాయం లేక చిన్నారుల అవస్థలు.