ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్ప సినిమా కి మరో యువకుడు బలయ్యాడు. అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని థియేటర్లో పుష్ప-2 సినిమా చూస్తుండగా మద్దానప్ప అని 35 ఏళ్ల అభిమాని మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పుష్ప సినిమా షో ముగిసిన తర్వాత కూడా అతను థియేటర్ లోనే ఉండడం గమనించిన ప్రేక్షకులు వెంటనే థియేటర్ యాజమాన్యానికి తెలియజేశారు. ఇక ఆ మనిషిని పరిశీలించిన థియేటర్ యాజమాన్యం ఆ వ్యక్తి చనిపోయినట్లుగా పోలీసులకు మరియు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.
Read More : చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు…ఇలాంటి పనులా చేసేది?
ఇక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే అతని బంధువులు మాత్రం మద్ధానప్ప తొక్కిసలాట లోనే మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో కాసేపు అక్కడ రచ్చ రచ్చ జరిగింది. ఇక వెంటనే పోలీసులు కలుగ చేసుకుని ఈ ఘటనపై ఖచ్చితమైన దర్యాప్తు చేస్తామని చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో చనిపోయిన వ్యక్తిని తీసుకొని కుటుంబంతో సహా అందరూ అక్కడ నుండి వెళ్లిపోయారు.
Read More : ఢిల్లీ రాజకీయాల్లో అల్లు అర్జున్ క్రేజ్.. పుష్ప పోస్టర్లతో ప్రచారం
ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పుష్ప చిత్ర యూనిట్ మరియు అల్లు అర్జున్ దగ్గర వరకు ఈ విషయం వెళ్లాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అన్నారు. అయితే పుష్ప -2 విడుదలైన తరువాత మొదటి రోజే రేవతి అనే మహిళ హైదరాబాదులోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట లో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ దృష్టికి ఆ విషయం వెళ్లడంతో నష్టపరిహారం కింద కుటుంబానికి 25 లక్షలు అందజేశాడు. మూడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సినిమా కావడంతో చాలామంది ధియేటర్లకు క్యూ కడుతున్నారు.
Read More : గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కు ఎంపికైన మన భారతీయ చిత్రం?