
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు కొన్ని కీలక సన్నివేశాలను సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 2021 వ సంవత్సరంలో ఇదే రోజు ( అక్టోబర్ 7) వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా అలాగే మధుర జ్ఞాపకాలుగా ఇప్పటికి కూడా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. నాతోటి భారతీయులందరూ నిరంతరం నాకు ఇచ్చిన ఆశీర్వాదాలకు ప్రత్యేక ధన్యవాదాలు అని రాసుకు వచ్చారు. ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వాధిపతిగా 25వ ఏడాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాను. మీ మద్దతుకు నేనెప్పుడూ కూడా రుణపడి ఉంటాను అని తెలిపారు. ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరచడానికి అలాగే నా దేశ పురోగతికి తోడ్పడడానికి నేను నిరంతరం.. కృషి చేస్తూ ఎక్కడ కూడా కృంగిపోకుండా అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు. మీ అందరి మద్దతుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అప్పటి జ్ఞాపకాల ఫోటోలను కొన్ని షేర్ చేశారు మోడీ.
Read also : ఓటర్లకు గందరగోళం లేకుండా SEC కీలక నిర్ణయం!
ఈ ఫోటోలను చూస్తుంటే అప్పట్లో నరేంద్ర మోడీ ఎంతో యువకుడిలా కనిపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చాలా మారిపోయారు. మూడవసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే మన భారత దేశాన్ని ఒక గొప్ప దేశంగా, బలమైన దేశంగా తీర్చిదిద్దారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీపడుతుందంటే దానికి ముఖ్య కారణం మన ప్రధానమంత్రి అని చెప్పవచ్చు. ఎన్నో పథకాలను దేశ ప్రజలకు అందించి, ఎన్నో రకాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఎప్పటికప్పుడు బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. దాదాపు 75 ఏళ్లకు పైగా వయసు ఉన్నా కూడా చాలా ఉత్సాహంగా, ఒక యువకుడిలా దేశ విదేశాల పర్యటనలకు వెళుతూ ప్రతి ఒక్కరి మన్ననలను పొందుతున్నారు.
Read also : మళ్లీ అడుగుపెట్టనున్న హిట్ మాన్… ఫ్యాన్స్ కు పూనకాలే!