
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని ఓ కాలేజ్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘోరంగా కొట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకే కాలేజ్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘోరంగా పిడుగుద్దులతో గుద్దుకున్నారు. ఎంతోమంది ఆపడానికి ప్రయత్నించినా కూడా విద్యార్థులు మైకంలో లేనట్లుగా ప్రవర్తించారు. చివరికి ఇద్దరు,ముగ్గురు షాప్ ముందు పనిచేసేటువంటి వాచ్మెన్లు వచ్చి గొడవను ఆపడానికి చాలా ప్రయత్నించి చివరికి ఎలాగొలా ఆపారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే…
Read also : వర్షాలకు సతమతమవుతున్న ప్రజలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!</a>
హైదరాబాద్, ఎల్బీనగర్ లో ఉన్న కాలేజీలోని విద్యార్థులు రెండు గ్యాంగులుగా విడిపోయి తీవ్ర గర్షణకు పాల్పడ్డారు. నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు విధ్వంసకరంగా దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రజలు చాలామంది ఆపడానికి వచ్చిన కూడా కుదరలేదు. ఇక చివరికి వాచ్మెన్ల చొరవతో ఈ ఘర్షణ అంతటితో ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి ఆ విద్యార్థులు వెళ్లిపోయిన తరువాత… ఎల్బీనగర్ పోలీసులకు ఈ సంఘటన గురించి సమాచారం అందడంతో సీసీ కెమెరా ద్వారా పరిశీలించి.. దాదాపు 15 మంది విద్యార్థులపై ఎల్బీనగర్ పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం ఏంటో తెలియదు కానీ… రోజురోజుకు యువత మాత్రం ఇలా దారుణంగా తయారవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాల్సిన విద్యార్థులు ఈరోజు ఇలా నడిరోడ్డుపై… విచక్షణ రహితంగా దాడులు చేసుకోవడమేంటి అని చుట్టుపక్కల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యువతకు పోలీస్ అధికారులు గట్టి సందేశం ఇస్తే గాని లైన్లోకి రాలేరు అని.. ఒకవైపు తల్లిదండ్రులు మరోవైపు మామూలు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. నేడే ఇలా నడిరోడ్డుపై కొట్టుకుంటున్నారంటే… భవిష్యత్తులో ఎన్నో నేరాలకు పాల్పడవచ్చు అని చుట్టుపక్కల ప్రజలు పోలీసు అధికారులకు విన్నపించారు. కాబట్టి పోలీసు అధికారులే దగ్గరుండి యువతకు గట్టి సందేశం ఇవ్వాలని.. లేదంటే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేలా వార్నింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
Read also : బంగాళాఖాతంలో అల్పపీడనం.. దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు