
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీ మహీ థియో యోనః ప్రచోదయాత్
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :- శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, శోభనమూర్తిగా కొలువై ఉంటుంది. ఆదిశంకరులు ఆరాధించిన ఈ గాయత్రీ దేవిని వీక్షిస్తే మనసు పులకితమౌతుంది. దైవ శక్తులకే మూలాధారం శ్రీ గాయత్రీ మాత. పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక. విశ్వ క్షేమానికై గాయత్రీ దేవి అర్చన అత్యంత ఆవశ్యకం. అందుచేతనే ఈ శరన్నవరాత్రులలో గాయత్రీ దేవిఉపాసన విశిష్ఠంగా పొందుపరిచారు దైవజ్ఞులు. శ్రీ గాయత్రీ దేవి అష్టోత్తరంతో అమ్మ వారికి షోడశోపచార పూజ గావించి, వీలైనన్ని సార్లు గాయత్రీ మంత్రాన్ని పఠించి అమ్మకి వడపప్పు, పానకం, పచ్చి చలిమిడితో పాటు అల్లపు గారెలు నివేదన చేస్తే అమ్మవారు మనలను చల్లగా కాపాడుతారు.
Read also : నిన్న, నేడు, రేపు వర్షాలే వర్షాలు… తెలంగాణకు హెచ్చరికలు!
Read also : బతుకమ్మ పండుగ వేళ… గుండెపోటుతో ఇద్దరు మహిళలు మృతి!