
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అనే పేర్లు మారుమోగుతున్నాయి. తాజాగా విశాఖపట్నం కి google వచ్చిన సందర్భంలో మంత్రి నారా లోకేష్ తో పాటుగా రాష్ట్రంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రావడానికి కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజలు కూడా సలాం కొడుతున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేశారు. ఆంధ్రాలో వంటకాలు స్పైసీ అని అందరూ అంటారు. పెట్టుబడులు కూడా మీ అందరికీ అలానే అనిపిస్తాయి. కానీ ఈ పెట్టుబడులను చూస్తున్నా పొరుగువారు ఇప్పటికే చాలా మంటను అనుభవిస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో గిగవాట్ కెపాసిటీతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతేకాకుండా మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఏవో ఒక పెట్టుబడులు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ముందుచూపుతో అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నవారు రాష్ట్రంలో వాళ్లకు విరుద్ధంగా ఉన్న కంపెనీలను తరిమేసే పనిలో నిమగ్నం అయ్యారే కానీ… రాష్ట్రానికి ఏమైనా కొత్త కంపెనీలు తీసుకువద్దామా, పెట్టుబడులు పెట్టించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిద్దామనే ఆలోచన కూడా లేదని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీరు ఎన్ని అడ్డంకులు పడినా కూడా రాష్ట్రంలో పెట్టుబడులు ఇలానే వస్తూనే ఉంటాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 2047 వ సంవత్సరంలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Read also : ట్రంప్ అంటే మోడీకి భయం.. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు : రాహుల్ గాంధీ
Read also : డేటింగ్ చేస్తే ఆ హీరో తోనే… తేల్చి చెప్పిన అనసూయ..!