
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజుకి వందలలో పెరిగిపోతున్న కూడా బంగారానికి ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. కేవలం ఒక బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగానే పెరిగిపోయాయి. ఈ సమయంలో చాలామంది ఒంటిపై బంగారం ధరించి వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాల విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా రద్దీ ప్రదేశాలు, ఫంక్షన్లు, మార్కెట్లు ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా బంగారపు విషయంలో చాలా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. అసలు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు బంగారము మన వెంట తీసుకు వెళ్లకుండా ఉంటేనే మంచిది అని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బంగారాన్ని సురక్షితమైన లాకర్లలో భద్రపరుచుకొని వెళ్లాలి అని కోరారు. ఇప్పటికే అన్ని రకాలుగా, అన్ని ప్రదేశాల్లో కూడా పోలీసులు దొంగలపై ఒక కన్నేసి ఉంచారు. బహిరంగ ప్రదేశాలలో లేదా ఎవరూ లేనటువంటి ప్రదేశాల్లో డ్రోన్లతో పోలీసులు పడి కాపులు కాస్తున్నారు. ఎవరైనా సరే దొంగతనాలు చేసినట్లుగా పోలీసు విచారణలో తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ కొంతమంది దొంగలు బంగారం లేదా డబ్బు కోసం ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు అని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. బంగారం ధరలు పెరిగినాము నేపథ్యంలో… దొంగలు కూడా పెరుగుతున్నారు అని.. కాబట్టి ఎప్పటికప్పుడు బంగారంపై దృష్టి వహిస్తూ ఉండాలి అని స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైనా సరే బయటకు వెళ్లిన సమయంలో బంగారు ఆభరణాలపై కాస్త జాగ్రత్తగా ఉండాలని… ఎవరైనా అనుమాదాస్పదకరంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Read also : AP ని బలంగా నిలబెట్టబోయేది గూగుల్.. ఇక రాష్ట్రానికి తిరుగులేదు : నారా లోకేష్
Read also : 23 ఏళ్ల పిల్లాడు అతడు.. వాడిపై విమర్శలు ఏంటి : గౌతమ్ గంభీర్