
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ లో ఒక సంచలనం సృష్టించినటువంటి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత మెల్లిగా అన్ని లీగ్లలో సెలెక్ట్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో కూడా వైభవ్ సూర్యవంశీ అడుగుపెట్టారు. అయితే ఐపీఎల్ లో బౌలర్లపై ఎలా విరుచుకుపడ్డాడో ఇక్కడ కూడా అలానే విరుచుకుపడుతున్నాడు. వైభవ్ సూర్యవంశి ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్లలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి మ్యాచ్ లో 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక రెండవ మ్యాచ్ లో కేవలం 20 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో భాగంగా మొదటి రెండు మ్యాచ్లలో ఏకంగా 15 సిక్సులు అలాగే 11 ఫోర్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశి బంతులను కొట్టే కొట్టుడుకు ఏకంగా ఇతర దేశాల క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా వైభవ్ 14 సంవత్సరాలకే ఇలా హిట్టింగ్ చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటూ ఒమన్ దేశ క్రికెటర్లు ఆశ్చర్యపోతూ.. చిన్న వయసులోనే ఇలా సిక్సులు బాధడం అంత సులభం కాదు అని.. నిన్న, మొన్నటి వరకు టీవీలో చూశాం.. కానీ నేడు ప్రత్యక్షంగా చూడబోతున్నాము అంటూ.. చెప్పుకొచ్చారు . కాగా ఇవాళ ఒమన్ తో జరగబోయే మ్యాచ్ లో మరి ఈ 14 ఏళ్ల యువ క్రికెటర్, విధ్వంసకరా ఓపెనర్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.
Read also : పెబ్బేరు కుమ్మర శాలివాహన మండల, యువజన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
Read also : మీ సేవ.. జస్ట్ Hi అని పంపిస్తే చాలు.. ఏ పనైనా చిటికలో అయిపోతుంది!





