
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. సినిమా పై హైపుతోనే చాలామంది ప్రేక్షకులు ధియేటర్లకు క్యూ కడుతున్నారు. ఒకవైపు జనసేన అభిమానులు మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఇక ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నటువంటి అభిమానుల అందరి దాహం కూడా నిన్న తీరిందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ లోనే ది బెస్ట్ కలెక్షన్లు ఈ OG సినిమాకి వచ్చాయని చిత్ర బృందం ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిన్న థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించినట్లుగా ట్రేడ్ అనలిస్ట్ అయినటువంటి sacnilk స్పష్టం చేసింది. ఈ సినిమా అన్ని ప్రీమియర్స్ కలిపే ఏకంగా 20 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమాకి 90.25 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు అంచనా వేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 69%, తమిళ్ భాషలో 18%, హిందీ భాషలో 10 శాతం ఆక్యుపెన్సి నమోదయినట్లుగా సమాచారం అందించింది. ఈ OG సినిమా ఆల్ టైం ఇండియా ప్రీమియర్స్ గ్రాసర్ గా నిలిచినట్లు మరోవైపు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లోనే ఇంత పెద్ద భారీ కలెక్షన్స్ మొదటి రోజు సాధించడం ఇదే మొట్టమొదటిసారి. ఈ సినిమాలో చాలామంది స్టార్ నటులు నటించారు. డైరెక్టర్ గా సుజిత్ మరోసారి తనేంటో నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత థియేటర్లలో విడుదలైన రెండవ సినిమా ఇది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్కటే పెండింగ్ లో ఉంది. ఆ సినిమా కోసం కూడా జనసేన అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.
Read also : శిలాఫలకం ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలి : మందుల సత్యం
Read also : సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లాలి : MLA కోమటిరెడ్డి