
క్రైమ్ మిర్రర్, చౌటుప్పల్ :- పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా విడుదలకు సిద్ధమైన OG సినిమా ఫస్ట్ బెనిఫిట్ షో టికెట్ చౌటుప్పల్‌లో రికార్డు స్థాయిలో వేలం వేయబడింది. వేలంలో పలువురు అభిమానులు పోటీ పడ్డారు. చివరికి చౌటుప్పల్‌కు చెందిన ఆముదాల పరమేష్ టికెట్‌ను రూ.1,29,999కు సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం ఇప్పటివరకు చౌటుప్పల్‌లో ఎప్పుడూ పలకని అత్యధిక ధరగా నమోదైంది. వేలంపాటలో గెలిచిన పరమేష్‌కు ఫస్ట్ టికెట్‌ను జబర్దస్త్ కమెడియన్ వినోదిని అందజేశారు. అభిమానుల హర్షధ్వానాల నడుమ టికెట్ అందజేత జరగగా, థియేటర్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
Read also : ర్యాగింగ్ తట్టుకోలేక… ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి!
వేలం ముగిసిన వెంటనే అభిమానులు బాణాసంచా పేల్చి, పూల వర్షం కురిపించి, పాటలకు డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరిపారు. పవన్ కల్యాణ్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో వేదిక సందడి చేసింది. పవన్ కల్యాణ్ నా జీవితానికి ప్రేరణ. ఆయన సినిమా ఫస్ట్ టికెట్ దక్కడం గర్వకారణం. వేలం ద్వారా వచ్చిన మొత్తం మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి అందజేస్తాను అని ఆయన తెలిపారు.
Read also : విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు : బొత్స