
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత థియేటర్లలో విడుదలైన రెండవ సినిమా ‘OG’. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి మంచి కలెక్షన్లను రాబెట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ నిర్మించినటువంటి ఈ సినిమా తాజాగా ఓటీటీ లో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో ఈనెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా ఈనెల 23వ తేదీన నెట్ ఫిక్స్ లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా పలు థియేటర్లలో రన్ అవుతూ ఉంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 500 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాను అని ఇప్పటికే ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇక సినిమాలలో నటించే అవకాశం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
Read also : మెడికల్ లోపాల పై ఒంటరి పోరాటం చేస్తూ ఎనిమిదేళ్లకు విజయం..!
Read also : బీసీ బంద్ లో పాల్గొని రాజకీయ నాయకులని షేక్ చేసిన కవిత వారసుడు..!