
క్రైమ్ మిర్రర్ /వికారాబాద్ జిల్లా ప్రతినిధి:- కేజీబీవీ పాఠశాల నవాబ్ పేటలో విద్యార్థులను ఎరుకలు కార్చిన సంఘటన మంగళవారం బయటకు వచ్చింది.దానిలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ కేజీబీవీ పాఠశాలను జిల్లా విద్యాధికారి రేణుకాదేవి,జీసిడీసీ అధికారి శ్రీదేవి, ఎమ్మార్వో జయరాం,ఎంపీడీవో అనురాధ,ఎంఈఓ అబ్దుల్ రహమాన్ తో కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన సంఘటనపై ఉపాధ్యాయులను ఆరా తీశారు.విద్యార్థులకు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఇలా ఉందని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులు పడుకునే గదులను ,వంటగది, తదితర వాటిని పరిశీలించారు.అదేవిధంగా పాఠశాల ఆవరణ వెనుక భాగంలో ఉన్న పిచ్చి మొక్కలు ,ప్లాస్టిక్ కవర్లలో తొలగించాలని ఎస్ఓ శ్రీలతకి సూచించారు.
నల్గొండ జిల్లాలో ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద (144 సెక్షన్) అమలు: ఎస్పీ శరత్ చంద్ర
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులలో ఎలుకలు కరిచిన విషయం తమకు సోమవారం తెలిసిందని,విషయం తెలియడంతో మంగళవారం పాఠశాలలో తనిఖీ చేయడం జరిగిందన్నారు.ఉపాధ్యాయులు ఈ విషయం అధికారుల దృష్టికి,తమ దృష్టికి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల ఎలుకలు కరిచి విషయంలో అలసత్వం వహించిన ఎస్ఓకి షాకభ్ నోటీస్ జారీ చేస్తున్నట్టు తెలిపారు.ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం బాగానే ఉందని,ఎలుక కరిచిన విషయంలో పిల్లలకు చికిత్స అందిస్తున్నామని,తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పాఠశాలలో ఇలాంటి ఘటన పునరావృత్తమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. దీనికంతటికి కారణం కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య సమన్వయం లేదనే వినికిడి వినిపిస్తోంది. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు, కిటికీలకు సంబంధించినటువంటి జలీలు మొదలైనవి ఏర్పాటు చేయాలని జిసిడిఓ అధికారి శ్రీదేవిని డీఈవో రేణుకా దేవి ఆదేశించారు.ఈ తనిఖీలో ఎఎంసి చైర్మన్ రాథో గీత సింగ్,వైస్ చైర్మన్ బల్వంత్ రెడ్డి,డైరెక్టర్స్ ఖదీర్, నర్సింహారెడ్డి,తదితరులు ఉన్నారు.
నితిన్ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్!.. అసలు తగ్గేదేలే..