క్రైమ్ మిర్రర్ – షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ రోడ్డు విస్తరణ పనులు కొన్ని సాంకేతిక మరియు భౌతిక ఆటంకాల కారణంగా నిలిచిపోయాయని పట్టణ మున్సిపల్ కమిషనర్ సునీతా రెడ్డి తెలిపారు.
రోడ్డు విస్తరణ ప్రాంతంలో డ్రైనేజీ పైపులు, విద్యుత్ స్తంభాలు, అలాగే జియో కంపెనీకి చెందిన కేబుల్ స్తంభాలు ఉండటం వల్ల పనులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. వీటి సమస్యలు పరిష్కరించేందుకు మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారని, సంబంధిత శాఖలకు నోటీసులు పంపినట్లు కమిషనర్ వివరించారు.
Also Read:ఎడతెరిపిలేని భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలి : ఎస్ఐ జగన్
మేము అన్ని సమస్యలను సమగ్రంగా పరిష్కరించి రోడ్డు నిర్మాణం చేపడతాం. హడావిడిగా పనులు చేస్తే ప్రజలకు సంబంధించిన అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్లు దెబ్బతినే అవకాశం ఉంది, అందుకే జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాం, అని సునీతా రెడ్డి పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని సాంకేతిక ఆటంకాలు తొలగిన వెంటనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని, రోడ్డు త్వరలోనే పూర్తవుతుందని హామీ ఇచ్చారు.
Also Read:భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కోదాడ సీఐ





