పెట్టుబడులంటేనే తెలంగాణ అనేలా ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు తగ్గట్లుగా మన ప్రణాళికలను రూపొందించాలి అని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోంది. విదేశీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంది. దావోస్ పర్యటన సందర్భంగా.. ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎ్‌ఫ)లో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 20 నుంచి దావోస్‌లో జరగనున్న డబ్ల్యూఈఎ్‌ఫకు ఆయన వెళ్లనున్నారు. అంతకంటే ముందు సింగపూర్‌లో పర్యటిస్తారు.
గేమ్ ఛేంజర్ హెచ్ డి ప్రింట్ లీక్.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పీఆర్ టీమ్?
ఈ నేపథ్యంలో.. గత ఏడాది దావో్‌సలో జరిగిన డబ్ల్యూఈఎఫ్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి పురోగతిపై సోమవారం తన నివాసంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులతో సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గత ఏడాది దావోస్ ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు ఏయే దశల్లో ఉన్నాయి? ఎన్ని ప్రారంభమయ్యాయి? అనే వివరాలను సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది దావోస్ డబ్ల్యూఈఎ్‌ఫలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు.