
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి చర్చించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మెగా డీఎస్సీ గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. జూన్ నెలలో బడులు మొదలయ్యేలోగా నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇక బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా మే నెలలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ఎంతో ధనికమైన రాష్ట్రం. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఎంతోకాలంగా అని ఎదురు చూసినా డీఎస్సీ అభ్యర్థులకు ఇది ఒక భరోసాగా నిలిచింది. ఇక రాష్ట్రాన్ని మరో ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర రాజధానిలో అమరావతి పనులు కూడా ప్రారంభమయ్యాయి అని…. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై కీలక ప్రకటనతో… డీఎస్సీ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పార్టీ కాలంలో ఎవరు కూడా విద్యార్థులను పట్టించుకోలేదని… కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ పార్టీ గత ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు.
ఎన్ని అడ్డంకులు వచ్చిన జగన్ ను విడిచి వెళ్లేదే లేదు :- పేర్ని నాని