
-
దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంపు
-
2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు లైసెన్స్‌లు
-
రెండేళ్ల పాటు కొనసాగనున్న లైసెన్స్ గడువు
-
నవంబర్‌తో ముగియనున్న ప్రస్తుత లైసెన్సుల గడువు
-
ఆరు శ్లాబుల ద్వారా లైసెన్సులు జారీకి నిర్ణయం
-
మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం
-
గౌడ్స్‌కు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి దరఖాస్తుల ఫీజును భారీగా పెంచారు. రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు లైసెన్సుల గడువు ఉండనుంది. మొత్తం ఆరు శ్లాబుల ద్వారా లైసెన్సులు జారీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. కాగా మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ రిజర్వేసన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గౌడ్లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించింది.
Read Also: