ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడువు
మే 3న ప్రవేశ పరీక్ష…
చౌటుప్పల్ బాలికల గురుకుల ప్రిన్సిపల్ టీ. విజిత
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు చౌటుప్పల్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ టీ.విజిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్ కళాశాలలు, 93 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
ఎంపీసీ, బైపిసి,ఎంఈసి,సీఈసీ గ్రూపులో ప్రవేశం కోరుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వచ్చేనెల ఏప్రిల్ 15వ తేదీ లోపు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 3వ తేదీన ప్రవేక్ష పరీక్ష విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలలో ఉంటుందన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని, ఇట్టి చక్కటి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ టి.విజిత తెలిపారు.
