మాటూరు పాఠశాలలో నోట్ బుక్, పెన్సిళ్ళ పంపిణీ

క్రైమ్ మిర్రర్,త్రిపురారం ప్రతినిది: ప్రైవేటు పాఠశాలల మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజులలో, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికై పాటుపడుతున్నారు. మాటూరు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు. వారి బోధన, క్రమశిక్షణ, పట్టుదల, సమయస్ఫూర్తి తదితర అంశాలతో పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు పాఠశాల అభ్యున్నతికి పాటుపడుతున్నారు.

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామములో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో రోజురోజుకి విద్యాబోధన మెరుగుపడుతుండడమే కాకుండా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇట్టి విషయాన్ని గమనించిన గ్రామంలోని యువకులు, పెద్దలు పాఠశాల అభివృద్ధికై తమవంతుగా విరాళాలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నారు.

పాఠశాల పూర్వపు విద్యార్థులు 1994 – 1999 బ్యాచ్ 20,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాఠశాలకు మైక్, సౌండ్ సిస్టమ్ అందించగా, మరొక పూర్వపు విద్యార్థి మరియు గ్రామస్థులు ఇచ్చిన 43,000 రూపాయల ఆర్థిక సహాయంతో నోట్ పుస్తకాలు కొనుగోలు చేసి, మిగిలిన డబ్బులతో పాఠశాలలో ప్రత్యేకంగా నియమించిన ట్యూటర్ కు నెలనెలా జీతం ఇచ్చి, వారిచే పిల్లలకు బోధన చేయిస్తున్నారు పాఠశాల ఉపాధ్యాయులు.

అయితే ఈరోజు ఉదయం స్థానికులు, పాఠశాల ఉపాధ్యాయులు ధానావత్ వాసు ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టి, విరాళాలు అందించిన వారిచేత ఆ నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు తదితర వస్తువులను పంపిణీ చేయించారు.

ఇట్టి కార్యక్రమంలో మాటూరు గ్రామ సర్పంచ్ వెంకట్రాం నాయక్, మాజీ సర్పంచ్ పాండు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, విద్యాకమిటీ మాజీ ఛైర్మన్ ధానావత్ రతన్ నాయక్, డీలర్ రాములు నాయక్, 1104 అదనపు కార్యదర్శి మోతీలాల్ నాయక్, కంప్యూటర్ ఆపరేటర్ కలకొండ శివకృష్ణ, గ్రామస్థులు కలకొండ శివశంకర మల్లయ్య, ధానావత్ చంటి, బెజవాడ యాదగిరి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button