
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో త్వరలో జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచించారు. కానీ ఎవరు కూడా ఊహించని విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. ఎందుకంటే… తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ అలాగే బిజెపి పార్టీలు చాలా బలంగా జూబ్లీహిల్స్ లో మా పార్టీ అంటే మా పార్టీని గెలుస్తుంది అని చాలా దీపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రజల మధ్యకు రావడంతో అంతగా ప్రజలకు దగ్గర కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించిన చంద్రబాబు నాయుడు ఈసారి ఈ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్నారు.
Read also : రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : రాఘవేందర్
ఇక ముఖ్య కారణం ఏమనగా త్వరలో జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోటీకి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా లేకపోవడంతో తాజాగా తెలంగాణ టిడిపి నేతలతో సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఉప ఎన్నికలు భాగంగా బిజెపి పార్టీ మద్దతు అడిగితే కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కూడా సంస్థాగతంగా బలోపేతం చేయడం పైనే దృష్టి పెట్టాలని నాయకులకు సూచించారు. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఆలస్యం అయ్యేలా ఉంటే ఈ లోపు ముఖ్య నాయకులతో కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబును కొంతమంది తెలంగాణ టీడీపీ నాయకులు కోరారు. కాగా ఇంతకుముందు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం జోష్లో ఉండేది. కానీ 2019లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఓడిపోయారో అప్పటినుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 2024లో అత్యధిక మెజారిటీతో గెలవడంతో మళ్ళీ తెలంగాణపై కూడా ఈసారి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు.
Read also : తెలుగు రాష్ట్రాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్ష సూచన…!