
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ డెస్క్ : చూడాడానికి పల్లెలో పెరిగిన సాధారణ బాలికలా కనిపిస్తుంది. కానీ రింగ్‌లో అడుగుపెడితే మాత్రం పులి పిల్లలా గర్జిస్తుంది! యుద్ధరంగంలో సింహస్వప్నం చూపిన ఈ చిన్నారి పేరు భవ్య తేజి, కొదమసింహంలా దూసుకెళ్లి ప్రత్యర్థులను చిత్తు చేస్తూది. రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం తన ఖాతాలో వేసుకుంది.
హనుమకొండలో అక్టోబర్ 10 నుంచి 12 వరకు జరిగిన అండర్-17 బాక్సింగ్ పోటీలులో ఆమె అదరగొట్టింది. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న భవ్య తేజి, స్థానిక రైతు జిల్లెల్ల జంగయ్య కుమార్తె. చిన్నతనం నుంచే యుద్ధకళల పట్ల ఆసక్తి పెంచుకున్న ఆమె, కరాటేలో ఎల్లో బెల్ట్ సాధించి తన ప్రతిభను చాటింది.
ఇప్పుడు బాక్సింగ్ రంగంలో అడుగుపెట్టి ఆరంభంలోనే బంగారు విజయాలు సాధించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో సన్మానం అందుకుంది. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, సహ విద్యార్థులు భవ్య తేజి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవ్య తేజిని అందరూ “పల్లె పిల్ల కాదు… పులి పిల్ల!” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ బంగారు తల్లి బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.