
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందడి ఊపందుకుంది. మొత్తం 22 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయం అభ్యర్థులతో కిటకిటలాడింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి మొత్తం 193 మంది అభ్యర్థుల నుంచి 241 నామినేషన్లు అందినట్లు అధికారులు వెల్లడించారు.ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగడంతో ఈసారి ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పార్టీల వారీగా దాఖలైన నామినేషన్లు ఇలా ఉన్నాయి:-
కాంగ్రెస్ – 87
బీఆర్ఎస్ – 53
బీజేపీ – 34
సీపీఐ, జనసేన – 26
స్వతంత్రులు – 33
బీఎస్పీ – 03
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (సింహం గుర్తు) – 01
అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 87 నామినేషన్లతో ముందంజలో నిలవగా, బీఆర్ఎస్ 53, బీజేపీ 34 నామినేషన్లతో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా 33 నామినేషన్లతో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, ఫిబ్రవరి 3న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు సాయంత్రానికి బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా స్పష్టతకు రానుంది.మొత్తం 22 వార్డులకు ఏకంగా 241 నామినేషన్లు దాఖలుకావడం చూస్తే, క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోరు ఎంత రసవత్తరంగా ఉండబోతుందో అర్థమవుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Koti ATM Robbery: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం దగ్గర స్పాట్ పెట్టి..
Shocking Scene in Bihar:నడి రోడ్డుపై వృద్ధురాలి అంత్యక్రియలు.. అసలు విషయం తెలిసి అంతా షాక్!





