⇒ ఈరోజు నువ్వు ఉన్నావు.. రేపు నేనుంటా
⇒ అధికారంలోకి వస్తే ఒక్కొక్కడి తాటతీస్తా
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష నాయకుల మధ్య వైరాలు ప్రతిరోజు కూడా ముదురుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఉన్న దాఖలు లేవు . జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క పార్టీ ప్రతిసారి అధికారంలో లేదు. అయితే తాజాగా ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు గుర్తు చేశారు. జైలులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ ను పరామర్శించిన కేటీఆర్ అనంతరం మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అధికారం ఉందని రెచ్చిపోతే రేపు అధికారంలోకి మేము వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాము అని కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తున్నారు అని కేటీఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా ఖ్యాతనపల్లి మున్సిపాలిటీలో మాకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ మంత్రి కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటిని SEC చూస్తూ ఊరుకుంది అని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టానుసారంగా మా నాయకులు,కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎప్పుడూ ఒకరి సొంతం కాదు.. సీఎం అలాగే పోలీసులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చిప్పకూడు తినే రోజులు కూడా వస్తాయి అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య వైరం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి

