
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- నోబెల్ శాంతి బహుమతి దక్కిందంటే ఆ వ్యక్తిని ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అలాగే ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకుగాను ఇటువంటి నోబెల్ బహుమతులు ప్రకటిస్తుంటారు. ఇదే నేపథ్యంలో వెనిజులా కు చెందినటువంటి ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో కు మాత్రం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆమెకు ఈ ఏడాది లోనే నోబెల్ అధికారులు విడుదల చేసిన నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. నోబెల్ అంటే బహుమతి గెలుచుకున్న కూడా దేశం దాటలేని పరిస్థితి ఆమెకు నెలకొంది. డిసెంబర్ పదవ తేదీన నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే ఆమెను ఆ దేశం పరారీలో ఉన్న నేరస్తురాలిగా ప్రకటిస్తుంది అని ఇంతకు ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా ఆమె దేశం దాటితే ఆమె పరారీలో ఉన్నట్లుగా నిర్ధారించి నేరస్తురాలుగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. దేశ ప్రజల కొరకు, వారి హక్కుల కోసం పోరాటం చేసినందుకుగాను ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ కూడా దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో సోషల్ మీడియా వేదికగా ఇదేంటి అని ఆ దేశం పై ఆగ్రహిస్తున్నారు. కాగా ఈ నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ కు వస్తుంది అనుకున్న సందర్భంలో వెనుజులా దేశానికి చెందిన ఈ కొరినా మచాడో కు వచ్చింది. నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న వారు అద్భుతమైన వ్యక్తులు అని.. అలాంటివారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం చాలా బాధగా ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Read also : Ibomma క్లోజ్ ఓకే.. మరి Movierulz పరిస్థితి ఏంటి ?
Read also : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఫేక్ వ్యక్తులు చెప్పే ఫేక్ మాటల్ని నమ్మకండి : TDP





