తెలంగాణ

4 నెలలుగా జీతాలు లేవు.. గద్దర్ కూతురిపై కళాకారుల తిరుగుబాటు?

తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటిలా ఉంది. ఉద్యోగులందరికి ఫస్ట్ తారీఖునే జీతాలు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతుండగా.. కొందరికి మాత్రమే ఒకటో తారీఖున జీతాలు అందుతున్నాయి. కొన్ని శాఖల్లోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు.

దివంగత గద్దర్ కూతురు వెన్నెల చైర్మెన్ గా ఉన్న సాంస్కృతిక సారధి కళాకారులకు వేతనాలు ఇవ్వకపోవడం చర్చగా మారింది.4 నెలలుగా జీతాలు లేవు.. జీతాలు ఇప్పించండని ప్రభుత్వాన్ని సాంస్కృతిక సారధి కళాకారులు వేడుకుంటున్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేక బతుకులు ఆగమవుతున్నాయని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు సాంస్కృతిక సారధి కళాకారులు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రతీ నెల 1వ తేదీన జీతాలు వస్తాయని ఆశించామని, కానీ నాలుగు నెలలుగా జీతాలే లేవని కళాకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెల చైర్మన్ అయ్యాక జీతాలు రావడంలేదని, వెంటనే జీతాలు విడుదల చేయకపోతే ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు సాంస్కృతిక సారధి కళాకారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button