
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో మళ్లీ మన పార్టీనే అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా మళ్లీ మనకు ఓట్లు వేసి గెలిపిస్తారు అని చాలా రోజుల తర్వాత కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. నిన్న సాయంత్రం వేళ కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి ఎర్రవల్లి మరియు నరసన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు మరియు వార్డు సభ్యులు కేసీఆర్ ను కలిశారు. ఏకగ్రీవమైనందుకుగాను సర్పంచులు మరియు వార్డు మెంబర్లను కెసిఆర్ సత్కరించి స్వీట్లు పంచారు. ఆ తరువాత వారందరి మనసుకు ధైర్యం చెప్పి రాబోయే రోజుల్లో కచ్చితంగా మనమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. మన ప్రభుత్వం మళ్లీ వస్తుంది… ప్రతి పల్లెలో వెలుగులు వస్తాయి అని పేర్కొన్నారు. మరో రెండేళ్లపాటు అధైర్య పడకుండా ప్రజలకు అండగా ఉంటూ నాయకులు ముందుకు నడవాలి అని తెలియజేశారు. అన్ని కాలాలు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండవు అని కాబట్టి తలవంచకుండా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అయితే అధికారం చేపట్టిందో అప్పటినుంచి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇక టిఆర్ఎస్ పార్టీ బాధ్యత అంతా కూడా కేటీఆర్ తన భుజం మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు.
Read also : వెండిని భారీగా అమ్ముతున్న ప్రజలు.. ఎందుకంటే?
Read also : ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యనే.. 50 లక్షలు ఇవ్వాల్సిందే : హరీష్ రావు





