Tuesday, March 10, 2026
Homeజాతీయంఆ జలపాతం వైపు ఎవరూ వెళ్లొద్దు.. శబరిమల వెళ్లే భక్తులకు అటవీశాఖ సూచన!

ఆ జలపాతం వైపు ఎవరూ వెళ్లొద్దు.. శబరిమల వెళ్లే భక్తులకు అటవీశాఖ సూచన!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కార్తీక మాసంలో ఎంతోమంది ప్రజలు అయ్యప్ప మాలలు ధరించి నిరంతరం అయ్యప్ప స్వామినే స్మరిస్తూ తమ దీక్షను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఒక్కొక్కరు శబరిమలకు చేరుకుంటూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా కొన్ని లక్షల మంది అయ్యప్ప మాలలు ధరించి శబరిమలకు చేరుకొని ముడుపులు చెల్లించుకుంటారు. అయితే తాజాగా శబరిమల వెళ్ళేటువంటి అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కేరళ అటవీశాఖ ఒక కీలక అలర్ట్ జారీ చేసింది.

Read also : Zelenskyy: రష్యా వైపు స్టాండ్ తీసుకున్న ట్రంప్, తగ్గేది లేదంటున్న జెలెన్‌స్కీ!

అయ్యప్ప స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి ఉరక్కళి జలపాతం వద్దకు ఎవరూ కూడా వెళ్ళవద్దు అని సూచించింది. సాధారణంగా అడవిలో నడుచుకుంటూ వెళుతున్నటువంటి ప్రతి అయ్యప్ప మాల ధరించిన భక్తుడు ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరించి మళ్లీ స్వామి వారి దర్శనానికి పయనం అవుతూ ఉంటారు. కానీ గత కొద్ది రోజుల నుంచి అక్కడ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకోవడం వల్ల కేరళ అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఉరక్కళి జలపాతం వద్ద గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా ప్రమాదాలు జరగడం అలాగే ఏనుగులు మరియు వన్యప్రాణుల సంచారం పెరగడం కారణంగా భక్తులు ఎవరూ కూడా అటు వెళ్ళకూడదు అని హెచ్చరించారు. అంతేకాకుండా ఆ మార్గమంతా కూడా ఏటవాలుగా, జారుడుగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తలుగా కేరళ అటవీశాఖ ఈ కీలక ప్రకటన చేసింది. కాబట్టి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఈ అడవి మార్గాన్ని వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అని తెలిపారు.

Read also : ఏంటీ.. పుస్తకం ఖరీదు రూ.15 కోట్లా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments